హైదరాబాద్ : అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఒలింపిక్ డే రన్ ఉత్సాహభరితంగా సాగింది. హైదరాబాద్ వ్యాప్తంగా 15 కేంద్రాల నుంచి క్రీడాకారులు, విద్యార్థులు ఒలింపిక్ స్ఫూర్తి రన్‌తో ఎల్‌బి స్టేడియంకు చేరుకున్నారు. 15000 మందికి పైగా పాల్గొన్న ఒలింపిక్ డే రన్ ముగింపు వేడుక ఎల్బీ స్టేడియంలో జరిగింది. రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ ఒలింపిక్ సంఘం ఆఫీస్ బేరర్లు 15 కేంద్రాల నుంచి వచ్చిన ఒలింపిక్ జ్యోతిలను అందుకున్నారు. ‘లెట్స్ రన్’ నినాదంతో ప్రతి రోజు 30 నిమిషాల వ్యాయామంతో ఆరోగ్యం, ఆహ్లాదం సొంతం చేసుకోవాలని ఈ సందర్భంగా క్రీడాకారులు, విద్యార్థులకు సూచించారు.