నిజమేకదా…
విప్లవం
ఓ సజీవ సిద్ధాంతం
ఓ పోరాట ఆచరణ
సిద్ధాంతంలో ఆచరణ రాటుతేలు
ఆచరణతోనే సిద్ధాంతం పరిపుష్టం
ఇదో నిరంతర సంగమ చక్రభ్రమణం
నిర్ధిష్ట పరిస్థితుల్లో
నిర్ధిష్ట విశ్లేషణా కార్యాచరణ
సమాంతరంగా చైతన్యస్పోరకంగా
క్రమించవలసిందే.
వ్యక్తిగత సృజనశీలత
సామూహిక సామర్థ్యతలో
అంతరాగం కావాల్సిందే…
ఆహానికి ఆధిపత్యానికి
ఇక స్థానమెక్కడీ
శాంతి సమతల స్థాపనే
అంతిమలక్ష్యం కదా…
అదే ప్రజాస్వామ్య ఉద్యమం
అదే పోరు పతాక.
పూవు నుండి కాయ
కాయ నుండి పండు
పరిణామాత్మక మార్పు నుండి
గుణాత్మక మార్పు
విప్లవాత్మక మార్పు
నీలో కావచ్చు నాలో కావచ్చు
మనలో కావచ్చు జనంలో కావచ్చు
నీ నుండి జనం వైపునకు
ప్రయాణిస్తున్నావా మరి!
– కె.శాంతారావు, 9959745723