పది నాణెం మార్కెట్ లో చలామణి చేసేందుకు ప్రజలు జంకుతున్నారు. దీనంతటికీ కారణం పది రుపాయల నాణెం చెల్లదు అంటూ వచ్చిన పుకార్లు, అప్పటి నుండి మార్కెట్లో పది రూపాయల నాణెంను వ్యాపారస్తులు, ప్రజలు తీసుకోవడం లేదు. ఈ మేరకు సోమవారం నిజామాబాదు జిల్లా కేంద్రంలో కెనరా బ్యాంక్ అద్వర్యంలో రూ. పది నాణెం చెల్లుబాటు అవుతుందని ప్రజలకు అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కెనరా బ్యాంక్ రిజినల్ ఆఫీస్ సిబ్బంది ప్రజలకు పది నాణెం పై ఉన్న అపోహను తొలగించే విధంగా అవగాహన కల్పించారు. పది నాణెం చలామణి అవుతుందని
ప్రజలు ఇచ్చి పుచ్చుకోవాలని సూచించారు. దీనిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎం ప్రదీప్,కెనరా బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.