వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏజీపీగా నియమితులైన పుప్పాల భానుకృష్ణను మంగళవారం బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు ఇరుకుల్ల అశ్విన్, కో కన్వీనర్ జెట్టి శేఖర్, న్యాయవాదులు విద్యాసాగర్ రావు, పిట్టల మనోహర్, పొత్తూరి అనిల్ కుమార్, పురుషోత్తం, కమటం అంజయ్య, గుండా రవి, రాజూరి రమేష్, రేగుల రాజ్ కుమార్, బొజ్జ నరేష్, కనికరపు శ్రీనివాస్, గుడిపెల్లి మహేష్ మహిళ న్యాయవాది పావని తో పాటు తదితరులు ఉన్నారు.