నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి, అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం మధ్యాహ్నం నిర్వహిస్తున్నట్లు ఏం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు పోషెట్టి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏం ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ వస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల నాయకత్వం ఈ సమావేశంలో పాల్గొనబోతుంది. సుప్రీం కోర్టులో వర్గీకరణను సాధించుకున్న తర్వాత జరుగుతున్న మొదటి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఇది అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.