మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జయంతి వేడుకలను మండల కేంద్రంలో మంగళవారం చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పద్మ విభూషణ్, భారతరత్న, క్షిపణి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన ఘనత అబ్దుల్ కలాం దాని కొనియాడారు. కార్యక్రమంలో పి హెచ్ సి వైద్యులు సురేష్, పంచాయతీ కార్యదర్శి క్రాంతి,మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్రావు, నాయకులు పడగల శ్రీనివాస్, జంగం లింగం తదితరులు పాల్గొన్నారు.