నవతెలంగాణ – నిర్మల్ జిల్లా/ సారంగాపూర్
మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం ఈ నెల 9 బుధవారం రాష్ట్ర మార్కెట్ శాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మార్కెట్ చైర్మన్ పదవి బీసీ లకు కేటాయించగా మైనార్టీ ఐన అబ్దుల్ హది కి ఛైర్మెన్ పదవి ఎలా కేటాయించారని కొందరు రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు. దీంతో మంగళవారం చైర్మన్ పదవి బీసీ కాకుండా మైనార్టీ కి కేటాయించడాన్ని తప్పుబడుతూ.. హైకోర్టు స్టే ఉత్తర్వులను జారీ చేసింది.