నిజామాబాద్ రైల్వే పరిధిలో రైలు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి బుధవారం తెలిపారు. రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని యువకుడు 25 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలిపారు. ఆర్మూర్ నిజామాబాద్ ల మధ్య గల మామిడిపల్లి రైల్వే గేటు వద్ద గుర్తుతెలియని గూడ్స్ రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి 8712658591, లేదా హెడ్నండ్లు 9440899341 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.