వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Inauguration of Paddy Grain Buying Centreనవతెలంగాణ – భిక్కనూర్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సొసైటీ చైర్మన్ రాజా గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2320, బి గ్రేట్ ధాన్యానికి రూ.2300 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో కాచాపూర్ సొసైటీ చైర్మన్ కృష్ణ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ స్వామి, వ్యవసాయ అధికారి రాధ, ఏ ఈ ఓ లతా, సొసైటీ సీఈవో మోహన్ గౌడ్, డైరెక్టర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.