
ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెడ్డు మోహన్ తమ గ్రామంలోని తాను చదువుకున్న యానంపల్లి ఉన్నత పాఠశాలకు స్వర్గస్తులైన తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ. 25 వేలతో కంప్యూటర్ డెస్క్ టాప్ ను బుధవారం బహూకరించారు. కంప్యూటర్ డెస్క్ టాప్ తో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వారన్నారు. చదువుకున్న చోటే విద్యాబోధన చేయడం, ఇదే కాకుండా తనవంతుగా సహాయ సహకారాలు అందజేస్తుండటం మర్చిపోలేనిదని వారు పేర్కొన్నారు. పాఠశాలకు అడగక ముందే సమకుర్చిన తేడ్డు మోహన్ కు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి పాఠశాల సిబ్బంది మాజీ ఎస్ఎంసి చైర్మన్ దాసరి గణేష్ ,అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు,గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బయ్య,సంతోష్, క్రాంతి కుమార్ హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ సభ్యులు ప్రతాప్,రాజు తదితరులు తేడ్డు మోహన్ కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇంతకు ముందు ఇదే పాఠశాలకు గతంలో కూడా బోరు మోటర్, బోరు వేయించిన అప్పల యెంబరి రాజు,శేరు భాస్కర్లను కూడా ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు హెల్పింగ్ హాండ్స్ సభ్యులు గ్రామంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను గ్రామస్తులు కొనియాడారు.