
రెంజల్ మండలం ధూపల్లి గ్రామంలో రెండవ రోజు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను అందజేయడం జరిగిందని పశు వైద్యాధికారి డాక్టర్ విట్టల్ పేర్కొన్నారు. 151 తెల్లజాతి పశువులు, 253 నల్ల జాతి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను పంపిణీ చేశామన్నారు. మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ నాగరత్న, గంగరాజు, సిబ్బంది నరేష్, లక్ష్మణ్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.