19న సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

CPI(M) Kamareddy District Mahasabha on 19thనవతెలంగాణ – మద్నూర్ 
జుక్కల్ మండల కేంద్రంలో జరిగిన సీపీఐ(ఎం) జుక్కల్ శాఖ మహాసభకు ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) గ్రామ శాఖ నుండి మండల జిల్లా మహాసభ నుండి జాతీయ మహాసభల వరకు జరుగుతున్నాయి అన్నారు. ఈ మహాసభలో ప్రజల సమస్యలపైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకుంటామని ఆయన అన్నారు. పార్టీ సభ్యులందరూ జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సభ్యులకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం   జిల్లా కమిటీ సభ్యులు, ఎస్ అజయ్  కుమార్, గోవింద్, జై వీరయ్య, షేక్, ఫిర్దోస్, విట్టల్, మోతీరం నాయక్, బి. అడప్ప, టి. సాయిలు, బాలాజీ సాగర్,సీపీఐ(ఎం పార్టీ సభ్యులు పాల్గొన్నారు.