ప్రభుత్వ కొలువులు సాధించిన అన్నా, చెల్లికి సన్మానం..

Honored to Anna and Chelli who achieved government standards..నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ లో ప్రభుత్వ కొలువులు సాధించిన గ్రామానికి చెందిన బక్కూరి జానా కృష్ణమూర్తి, మౌనిక అన్నా చెల్లెళ్లను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. 2024 డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో జిల్లాలో ఓపెన్ కేటగిరిలో జానా కృష్ణమూర్తి 55వ ర్యాంక్, మౌనిక 107వ ర్యాంక్ సాధించి ఎస్జీటీ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు అన్నా చెల్లిని అభినందిస్తూ గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమములో తమ్మన్న, లింగన్న, శీను, రవి, మురళీ, బక్కన్న, నారాయణ, సంపత్, ముత్తెన్న, అశోక్, శ్రీధర్, సత్యానంద్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.