యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్కూరి డైరెక్ట్ చేసిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. నిసా ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘డైరెక్టర్ సాహిత్‌తో ‘సవారి’ సినిమా చేశాను. తను కొత్త థాట్స్‌తో ‘పొట్టేల్’ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. కథ విని కన్నీరొచ్చింది. పిల్లల చదువు కోసం పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అయినా పడాలి అనే మంచి పర్పస్ ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా డిఫరెంట్. ఏదో సినిమాకి రీ-రికార్డింగ్ చేసినట్లు ఉండదు. సందర్భం నుంచి మ్యూజిక్ క్రియేట్ అవుతున్నట్లుగా ఉంటుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత. దీన్ని చాలా నేచురల్‌గా తీశారు. దానికి తగినట్టుగానే మ్యూజిక్ ఇవ్వడం పెద్ద ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇందులో ఉన్న 4 పాటలను కాసర్ల శ్యామ్ రాశారు. ప్రతి లిరిక్ కథకు చాలా ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ తర్వాత పాటలు మరింతగా రీచ్ అవుతాయి’.