రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి.పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని రామానాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ, ‘ఈసినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘మా సినిమా మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో సరికొత్తగా ఉంటూ ఆకట్టుకుంటుంది’ అని హీరో రామ్ కార్తీక్ చెప్పారు. నాయిక కశ్వి మాట్లాడుతూ, ‘ఇదొక డిఫరెంట్ స్క్రిప్ట్. పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసే కుర్రాడి జీవితంలోకి వచ్చే అమ్మాయిగా నటించా. నా పాత్ర మిమ్మల్ని అలరిస్తుంది’ అని తెలిపారు.