నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని బట్టు తండాలో శనివారం సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ రాతుల రెడ్డి నాయక్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మారుమూల ప్రాంతాలైన తండాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, ప్రభుత్వ వైపు గంప గోవర్ధ సహకారంతో గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద రూ పది లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని, ఈ సందర్భంగా గంప గోవర్ధన్ కు గ్రామం తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లచ్చిరాం, బీఆర్ఎస్ నాయకులు చంద్రు నాయక్, సంతోష్ నాయక్, రవి నాయక్, బన్సీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.