లా కాలేజీలో స్పాట్‌ అడ్మిషన్లు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల న్యాయ కళాశాలలో ఈనెల 19న స్పాట్‌ అడ్మిషన్లు ఇస్తున్నామని ఆ సంస్థ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ఈ మేరకు బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలోమహేశ్వరంలోని మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల మెన్స్‌కాలేజీ, హన్మకొండ కాజీపేటలోని గురుకుల ఉమెన్స్‌ కాలేజీలో స్పాట్‌ అడ్మిషన్లు తీసుకుంటామనీ, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు హన్మకొండలోని కాజీపేట గురుకుల ఉమెన్స్‌ లా కళాశాల ప్రిన్సిపాల్‌ – 9396600601, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గురుకుల మెన్స్‌ లా కాలేజీ ప్రిన్సిపాల్‌ – 9908344469 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.