ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ‘దీపావళి షాపోత్సవ్’ 2024

  • తమ సభ్యుల కోసం ప్రత్యేక డీల్‌లు, ఆఫర్‌లు, ప్రయోజనాలు అందిస్తుంది
  • దీపావళి షాపోత్సవ్ అక్టోబర్ 09 – నవంబర్ 01, 2024 మధ్య మొత్తం 26 స్టోర్‌లలో మరియు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.
  • ‘డీల్స్ ఆప్కే లియే కుషియాన్ సబ్కే లియే’ బ్రాండ్ ట్యాగ్‌లైన్‌తో, ఈ సేల్ కిరాణా సభ్యులకు అనేక కేటగిరీలు మరియు ఉత్పత్తులలో అద్భుతమైన డీల్‌లు మరియు ఆఫర్‌లను అందిస్తుంది.
  • బంపర్ ప్రైజ్ లక్కీ డ్రా ఆఫర్‌లు మరియు ఎంపిక చేసిన బ్రాండ్‌లపై గొప్ప ఆఫర్‌లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సభ్యులు అద్భుతమైన రివార్డ్‌లను గెలుచుకునే అవకాశం ఉంటుంది.

నవతెలంగాణ బెంగళూరు: భారతదేశంలో స్వదేశీయంగా అభివృద్ధి చెందిన ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ యొక్క డిజిటల్ బి 2బి మార్కెట్‌ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, దాని బి 2బి సభ్యుల కోసం 2024 అక్టోబర్ 9 నుండి నవంబర్ 1వ తేదీ మధ్య దీపావళి షాపోత్సవ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘డీల్స్ ఆప్కే లియే కుషియాన్ సబ్కే లియే’ ట్యాగ్ లైన్ తో నిర్వహించబడుతున్న ఈ సేల్ ఈవెంట్ ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ యొక్క మొత్తం 26 స్టోర్‌లు మరియు ఆన్‌లైన్ ఛానెల్‌లలో అందుబాటులో ఉంటుంది. కిరాణా భాగస్వాములు అన్ని ఉత్పత్తి విభాగాలలో గొప్ప డీల్‌లను పొందవచ్చు. కంపెనీ తమ బి2బి సభ్యులకు మరింత పొదుపు మరియు లాభాలను పెంచుకునే అవకాశాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ హెడ్ ఆఫ్ స్ట్రాటజీ & ట్రాన్స్‌ఫర్మేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు గ్రూప్ హెడ్ దినకర్ అయిలవరపు మాట్లాడుతూ, “ కిరాణా సభ్యులు, ఎస్ఎంఈ లు (చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు) మరియు ఇతర వ్యాపార యజమానులకు పండుగల సీజన్‌లో వినియోగదారుల అవసరాలను తీరుస్తూనే, తమ పొదుపును పెంచుకోవడానికి మరియు లాభాలను మెరుగుపరుచుకోవటానికి అవకాశాన్ని దీపావళి షాపోత్సవ్ అందిస్తుంది. అనుకూలమైన డీల్‌లు మరియు ఆఫర్‌ల ద్వారా, స్థిరమైన మరియు లాభదాయకమైన మార్గంలో వారి వ్యాపార వృద్ధికి మద్దతు ఇవ్వాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌ వద్ద , కిరాణా పర్యావరణ వ్యవస్థ కోసం శాశ్వత విలువను సృష్టించడం, వారి కార్యకలాపాలను బలోపేతం చేయడం, విజయాన్ని సాధించడంలో వారికి సాధికారత కల్పించడం పరంగా నిబద్ధత పట్ల మేము స్థిరంగా వున్నాము” అని అన్నారు.
తమ ట్యాగ్‌లైన్‌కు అనుగుణంగా, దీపావళి షాపోత్సవ్ వివిధ విభాగాలలో ఈ సీజన్‌లో అతిపెద్ద డీల్‌లను అందిస్తామని హామీ ఇస్తుంది. ఈ సంవత్సరం, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ దీపావళి సీజన్‌ను మరింత ప్రత్యేకంగా చేయడానికి, జాతీయ మరియు ప్రాంతీయ బ్రాండ్‌లపై అనేక విభాగాలను విస్తరించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ కొత్త ఆవిష్కరణ లు ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ, ప్రత్యేకమైన ప్రాంతీయ ప్రాధాన్యతలకనుగుణంగా, దేశవ్యాప్తంగా వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి.
దీపావళి షాపోత్సవ్ బంపర్ ప్రైజ్‌లను కలిగి ఉంటుంది, ఇక్కడ కొనుగోలుపై ఆధారపడి కస్టమర్‌లు అద్భుతమైన బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా, సభ్యులు దాని ఆన్‌లైన్ ఛానెల్‌లో హీరో ఆఫర్‌లు, ఫ్లాట్ ప్రైస్ స్టోర్, బోగో ఆఫర్‌లు మరియు మరిన్నింటి వంటి ఆకర్షణీయమైన ఆఫర్‌ల ద్వారా వివిధ ప్రయోజనాలను పొందవచ్చు.