ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్పర్సన్

Chief Minister's photograph arranged by Municipal Chairperson– వడ్డెర కాలనీలో ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ 
– పాఠశాలలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంతో ఆగ్రహం 
నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి పట్టణంలోని వడ్డెర కాలనీ 42వ వార్డులో ప్రాథమిక పాఠశాలను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ… స్కూల్ చుట్టు పక్కల ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. అలాగే స్కూల్లో  విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజన ఆహారం గురించి అడిగి తెలుసుకొన్నారు. నాణ్యమైన భోజనం పెట్టాలని పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు, ప్రధానోపాధ్యాయులకు సూచించరు. పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటం లేకపోవడంతో వెంటనే మున్సిపల్ చైర్మన్ తెప్పించి ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో పాఠశాల ఆవరణము లేకపోవడంపై ప్రధానోపాధ్యాయునీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఈ స్థాయి నుండే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని మంత్రుల పేర్లు, రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితర దేశ, రాష్ట్ర ముఖ్యమైన హోదాలలో గల వారి పేర్లను ఇప్పటి నుండే వారికి సూచించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, ఎంఈఓ ఎల్లయ్య, కౌన్సిలర్లు. చాట్ల వంశీకృష్ణ, పాత శివ కృష్ణమూర్తి, శానిటైజర్ ఇన్స్పెక్టర్ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.