రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ 

Poster unveiling of State Congressనవతెలంగాణ – కంఠేశ్వర్  
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ను నిజామాబాద్ ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ..  ప్రజాస్వామ్యం సమానత్వం స్త్రీ విముక్తికై నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ హింస లేని సమాజంకై పోరాడుతున్న ఐద్వా 4 వ రాష్ట్ర మహాసభ  భద్రాద్రి కొత్తగూడెంలో జరగబోతున్నాయి మహాసభను జయప్రదం చేయడం కోసం అన్ని జిల్లాల నుండి మహిళలు కదలి వచ్చి విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు  వనజ, సంతోషి, తదితరులు పాల్గొన్నారు.