అండర్ 17 వాలీబాల్ జోనల్ స్థాయికి ఎంపికైన విద్యార్థులు వీరే..

These are the students selected for Under 17 Volleyball Zonal level.నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం  జరిగిన అండర్-17 వాలీబాల్ జోనల్ స్థాయికి ఎంపికైన విద్యార్థుల వివరాలను ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం వెల్లడించారు. బాలుర విభాగంలో శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలకు చెందిన అభినవ్, శ్రీమాన్, రాకేష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన రాజ్ కుమార్, విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలకు చెందిన వికాస్, రిషివర్ధన్, సచిన్, మోర్తాడ్  మహాత్మ జ్యోతిబాపూలే ఉన్నత పాఠశాలకు చెందిన సాగర్, విగ్నేష్, విక్కీ, హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిధిత్,  తిమ్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సాయినాథ్, అదనపు ప్లేయర్స్ గా ధర్మోరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన దీక్షిత్, మిసిమి ఉన్నత పాఠశాలకు చెందిన రవి చరణ్, విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలకు చెందిన బాల నితీష్ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మర్ పల్లికి  చెందిన వైష్ణవి, శరణ్య, శిరీష, నందిని, సుప్రియ, శ్రీజ, మిసిమి ఉన్నత పాఠశాలకు చెందిన జయశ్రీ, శాలిని, పౌలస్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మోరా చెందిన లహిత, రాణి,మోహిత, అదనపు ప్లేయర్స్ గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మర్ పల్లికి చెందిన గీతిక, శ్రీ భాగ్య, రచిత, వర్ధిని, గంగాదేవి ఎంపికయ్యారు.  జూన్ స్థాయికి ఎంపికైన విద్యార్థిని విద్యార్థులను మండల విద్యాధికారి ఆంధ్రయ్య అభినందించారు.