నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగులైన యువకులకు కేంద్ర ప్రభుత్వ దినదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డి.డి.యు.జి.కె.వై) పథకములో భాగంగా న్యాక్ ఆధ్వర్యంలో 3నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యాక్ ల్యాండ్ సర్వే, ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్, 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుపేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తు యూనిఫాం, స్టేషనరీ, శిక్షణ సామాగ్రి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికేట్ తో పాటు వివిధ కంపెనీలలో ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 18 సం.రాల నుండి 35 సం.రాలు కలిగి ఉండలాని, శిక్షణ కొరకు విద్యార్హత సర్టిఫికెట్, కులదృవీకరణ పత్రము, ఆదాయ దృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నాలుగు పాస్పోర్టు సైజు ఫోటోలతో న్యాక్ కార్యాలయంలో ఈనెల 24లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 9154548063, నెంబర్ ను సంప్రదించాలని కోరారు.