వర్గీకరణ ముసుగులో రిజర్వేషన్ ఎత్తివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని మాల మానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ల రమేష్ నాయకులు అక్కవత్తుల దేవయ్య బోర్లకుంట ప్రభుదాస్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ఏబిసిడి వర్గీకరణను చేస్తామని ప్రకటించడం అంటే రిజర్వేషన్లు పూర్తిస్థాయిలోఎత్తివేయడానికే పావులు కదపడమేనన్నారు. రిజర్వేషన్ ఎత్తివేసి దళితులకు రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కులను సంపదను దూరం చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించిన పాలకవర్గాలు మాల మాల ఉపకులాల ఉద్యమాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. ఈ విషయంపై మాల మాల ఉపకులాలు ఐక్యంతో పోరాడి హక్కులను సాధించుకోవాలన్నారు జాతి సమైక్యతను కాపాడాలన్నారు. ప్రభుత్వం సర్వేల పేరిట ఆలస్యం చేయకుండా నిజమైన కులగరణ జరిపి ఆ తర్వాతనే రిజర్వేషన్లు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ నాయకులు, సిటీమల భరత్ కుమార్ జాడి గంగాధర్ ముల్కల ప్రభాకర్, జునుగురి మల్లయ్య దుర్గం నందయ్య మునిసిల చేలేంధర్ దుర్గం అమృత రావు మాణిక్యం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.