అల్లూరు బొడ్రాయి ప్రతిష్టాపన కమిటీ నియామకం

నవతెలంగాణ – యైటింక్లైన్ కాలనీ
రామగుండం మండలంలోని అల్లూరు గ్రామంలో డిసెంబర్ 12,13,14 తేదీలలో ఏర్పాటు చేయబోయే బొడ్రాయి అమ్మవారి ప్రతిష్టాపనకు కమిటీని నియమించినట్లు 18వ డివిజన్ కార్పోరేటర్ బాదే అంజలీదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ అధ్యక్షులుగా బాదే అంజలీదేవి ఉపాధ్యక్షులుగా ఆరెల్లి రాజమల్లు గౌడ్, ఏగోలపు సత్యనారాయణ గౌడ్, మారెల్లి రాంరెడ్డి, బీనవేని రవి గౌడ్, దాసరి శ్రీహరి ప్రధాన కార్యదర్శిగా మారెల్లి చిన్న రాజిరెడ్డి, కోశాధికారిగా బాదే భూమయ్య కార్యదర్శులుగా అన్ని కులాల పెద్దలను నియమించినట్లుగా తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మవార్లను ప్రతిష్టించి దాదాపుగా 70 ఏళ్ళు గడుస్తున్నందున దానిని పునః ప్రతిష్టాపన చేసేందుకు గ్రామస్తులంతా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. కొలుపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు, గ్రామ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఈ కార్యక్రమం నిర్వహించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.