చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని చిగురుపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కొయ్యూరు ఎస్సై నరేష్ కథనం ప్రకారం కుర్రి రవితేజ (20) అనే యువకుడు పెద్దపేట గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఈనెల 5న ఇంటికి తీసుకోని వచ్చాడు. దీంతో గ్రామంలో ఉండే అమ్మయి బంధువులు దాడి చేయడంతో అవమానం భరించ లేక భయంతో రవితేజ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమించిన కుటుంబ సభ్యులు అతన్ని భూపాలపల్లి ఆస్పత్రిల్లో చికిత్స చేయించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స అందించారు. చికిత్స అందించిన ప్రయోజనం లేదని వైద్యులు తెలుపడంతో ఈనె 19న రవితేజను ఇంటికి తీసుకచ్చారు. ఇంటికి తీసుక వచ్చిన కొద్ది సేపటికి అతను మరణించినట్లుగా ఎస్సై పేర్కొన్నారు. మృతుని తండ్రి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలియజేశారు.