డి ఎల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆట సందీప్ హీరోగా, శగ శ్రీ హీరోయిన్‌గా రామకృష్ణ కంచి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది షార్ట్ కట్’. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ఆట సందీప్ హీరోగా ఎదగడం ఎంతో సంతోషంగా ఉంది. అయితే హీరోగా ఎంత ఎత్తుకు ఎదిగినా కొరియోగ్రఫీని మాత్రం విస్మరించవద్దు. ఈ సినిమాలో ఉన్న డైలాగులు కొన్ని సినిమా వాళ్ళ జీవితాలకు అతి దగ్గరగా ఉన్నాయి. దర్శకుడు రామకృష్ణ సినిమాను చాలా బాగా తీశారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’ అని తెలిపారు.
‘హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటన్ సిటీలో రోజు రోజుకు పెరుగుతున్న డ్రగ్ కల్చర్ పై సినిమా తీశాం. డ్రగ్స్ వల్ల సమాజానికి ఎంత ప్రమాదం అనే అంశాన్ని చెబుతూనే, డ్రగ్స్ నివారణ కోసం ఏం చేయాలనే విషయాన్ని కూడా సినిమాలో చెబుతున్నాం. హీరో అట సందీప్‌కు కథ చెప్పగానే అంగీకరించి నందుకు కృతజ్ఞతలు’ అని దర్శకుడు రామకృష్ణ కంచి అన్నారు. హీరో అట సందీప్ మాట్లాడుతూ,’కథ బాగా నచ్చింది. కామెడీతో పాటు యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ సినిమాలో రీ -రికార్డింగ్‌కి ఎంతో ప్రాధాన్యత ఉంది. సినిమా ఇండిస్టీలో డైరెక్టర్ అవుదామని ప్రయత్నిస్తున్న యువకుడి జీవితం ఎలా మారింది అనేదే ఈ సినిమా’ అని తెలిపారు. ‘ఇందులో నేను చాలా మంచి పాత్ర పోషించాను. ఇది తప్పకుండా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు రామకృష్ణకు కృతజ్ఞతలు’ అని హీరోయిన్ శగ శ్రీ చెప్పారు.