సామ్‌సంగ్‌ నుంచి గెలాక్సీ ఏ16 5జీ విడుదల

గూర్‌గావ్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ కొత్తగా గెలాక్సీ ఏ16 5జీని విడుదల చేసింది. రెండు వేరియంట్లలో లభించే దీని ప్రారంభ ధరను రూ.18,999గా నిర్ణయించింది. 50ఎంపీ, 5ఎంపీ అల్ట్రావైడ్‌, 2ఎంపీ మాక్రో లెన్స్‌ కెమెరాలను అమర్చింది. సెల్ఫీలూ వీడియో కాల్స్‌ కోసం 13-మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉంటాయి. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్‌, 8 బీజీ ర్యామ్‌ విత్‌ 256 బీజీ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంది.