రంజీ వేదికగా మహబూబ్‌నగర్‌!

రంజీ వేదికగా మహబూబ్‌నగర్‌!– హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు
మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ స్టేడియాన్ని రంజీ వేదికగా తీర్చిదిద్దుతామని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు తెలిపారు. రూ. 80 లక్షల వ్యయంతో గ్రీన్‌ టర్ఫ్‌ వికెట్‌ పనులకు భూమి పూజ చేసిన చేసిన జగన్‌మోహన్‌ రావు..రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి, హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు దేవరాజ్‌, దల్జీత్‌సింగ్‌, బసవరాజు, సిజె శ్రీనివాసరావులతో కలిసి డ్రెస్సింగ్‌, రిఫ్రెషింగ్‌ రూమ్‌లను ప్రారంభించారు. త్వరలోనే మరో రూ.20 లక్షలతో స్టేడియంలో అధునాతన వసతులు ఏర్పాటు చేయనున్నామని, రానున్న సీజన్లలో ఇక్కడ రంజీ మ్యాచులు నిర్వహించే విధంగా అభివద్ధి చేసేందుకు హెచ్‌సీఏ ప్రణాళికలు సిద్ధం చేసిందని జగన్‌మోహన్‌ రావు వెల్లడించారు.