నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని గుర్జకుంట గ్రామంలో స్మశానవాటికలో బోరు మోటర్ ను ఎంపీపీ గాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ యాదగిరి, సర్పంచ్ కందడి మనోహర రమేష్ రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహకారంతో బోరు మోటర్ వేయించడం జరిగిందని.
గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్న గంప గోవర్ధన్ కు గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు రామచంద్రం, ఎంపిటిసి గజెల్లి మీనా దుర్గ బాబు నేత, ఉప సర్పంచ్ లక్ష్మీ నర్సింలు, గ్రామ శాఖ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు రవీందర్ రెడ్డి, కవితా, సువర్ణ, మాజీ సర్పంచ్ భూపాల్, సాయి రెడ్డి, సంతోష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పుట్ట నరేష్, సుధాకర్ రెడ్డి, మల్లారెడ్డి, వీడిసి అధ్యక్షుడు దుర్గారెడ్డి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు