ములుగు జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా భానోత్ రవిచందర్ నియమితులయ్యారు. నూతనంగా గ్రంథాలయ చైర్మన్ గా నియమితులైన బానోతు రవి చందర్ ప్రమాణ స్వీకారానికి మంగళవారం మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరై శాలువతో సత్కరించి, పుష్పగుచ్చం అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ , సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేం లచ్చుపటేల్, గౌరవ మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ముజఫర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, బత్తిని రాజు, మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వర్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ యాషాడపు మల్లయ్య, జిల్లా నాయకులు తాండాల శ్రీను, రాపోలు సంజీవ రెడ్డి, చర్ప రవీందర్, మండల నాయకురాలు ముండ్రాతి రాజశ్రీ , మండల నాయకులు మంకిడి ప్రశాంత్ , తోలేం కృష్ణ , పుర్రి సమ్మయ్య, ఎనగంటి నరేష్, బొప్ప వినోద్, నునవత్ శ్రీను, కల్వల సమ్మయ్య, నార్లపూర్ గ్రామకమిటి అధ్యక్షులు మొక్క శ్రీను, తాడ్వాయి మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గజ్జెల రాజశేఖర్, కార్తీక్, రాములు, బొర్రయ్య, నర్సింగరావు, రమేష్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.