
నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రజలు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని మంగళవారం మచ్చాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో రమేష్ కళాబృందం వాళ్లు హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో వై ఆర్ జి కేర్ లింక్ వర్కర్ సంస్థ లింక్ వర్కర్ భూక్య రాము పాల్గొన్నారు గ్రామంలో డోర్ టు డోర్ విజిట్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు హెచ్ఐవి ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అని వివరించి చెప్పారు హెచ్ఐవి ఎన్ని మార్గాలుగా వస్తుంది ఎలా రాదు వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించి చెప్పారు కళాజాత బృందం వాళ్ళు పాటలతో మరియు మాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు చాలా ఉత్సాహంగా కళాజాత ప్రోగ్రాం ని సందర్శించారు .