
నవతెలంగాణ – ధర్మారం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకొని, తమ వరి ధాన్యం పంటను దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించి, ప్రభుత్వ మద్దతు ధర పొంది రైతులు లబ్ధి పదాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కాజా మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి భద్రమ్మ లింగయ్య గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మేళతళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. పూల బొకే అందించారు ఈ సందర్భంగా కొత్తూరు గ్రామ ప్రజల తో మమేకమై ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రూపులా నాయక్, వైస్ చైర్మన్ అరిగెల లింగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులు తాళ్ల పెళ్లి భద్రమ్మ లింగయ్య గౌడ్, కాం పెళ్లి పోచయ్య, మాజీ ఎంపిటిసి భూక్య రాజేశం నాయక్,,; భూక్య రాజేశం,నెరువట్ల మల్లయ్య, కొక్కుల రామనారాయణ, మీనుగు రమేష్, భూక్య రాజేందర్ నాయక్, రమేష్ నాయక్, కత్తర్ల సదయ్య, డీలర్ రమేష్ రాచకొండ రాములు, మద్దెల నరసయ్య, కొత్త నరసింహులు, చింతల జగన్మోహన్ రెడ్డి,దేవి జనార్ధన్,కాడే సూర్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ మెడవేణి తిరుపతి, ఆవుల మల్లయ్య, భూక్య మల్లేష్ నాయక్, మీనూగు స్వామి, తదితరులు పాల్గొన్నారు.