నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇటీవల మోకాలి కీలు మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ మాతృమూర్తిని వారి ఇంటిలో పరామర్శించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డికి బుధవారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మ త్వరగా కోలుకోవాలని సుధర్శన్ రెడ్డి అన్నారు. అమ్మ ఈ వయసులో కూడా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆప్యాయతగా పలకిరించి తన వాత్సల్యాన్ని పంచుతారన్నారు. అమ్మతో, రత్నాకర్ కుటుంబంతో తమ అనుబంధం రెండు దశాబ్దాలది అన్నారు. వారి వెంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తాహెర్ బిన్ హందాన్, అరెకెల నర్సారెడ్డి, గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.