టీచర్ ఉద్యోగం సాధించిన సౌమ్యకు సన్మానం..

An honor for Soumya who got a job as a teacher..నవతెలంగాణ – జన్నారం

జన్నారం మండలం వినాయక నగర్ కు చెందిన చిటికేసి వసంత, లచ్చన్నల కూతురు సౌమ్య ఒక ఉద్యోగం కాకుండా రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించింది. పోలీస్ జాబ్ ట్రైనింగ్ లో ఉండగానే టీచర్ జాబ్ సాధించినందుకు బుధవారం వినాయక నగర్ మండలి తరఫున ఘనంగాసన్మాన కార్యక్రమం నిర్వహించారు. పూలమాలలు, శాలువాలతో కాలని వాసులు సౌమ్య ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో వినాయక మండల్ సభ్యులు జి మోహన్ రెడ్డి ,సుజాత. హరికృష్ణ, అంజన్న,నవిత. విద్యాసాగర్, మసూద్ తదితరులు పాల్గొన్నారు.