గత ప్రభుత్వంలాగే అన్యాయం చెయొద్దు

– బేగంపేటలో డబుల్ ఇండ్ల బాధితుల విజ్ఞప్తి 

– నిరుపేదలకు ఇండ్ల స్థలాల కేటాయించాలని  విన్నపం
నవతెలంగాణ – బెజ్జంకి 
డబుల్ ఇండ్ల స్థలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అధికారులు యత్నిస్తున్నారని..గత ప్రభుత్వం మాదిరిగా మాకు అన్యాయం చెయొద్దని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరుపేదలు విజ్ఞప్తి చేస్తున్నారు. బుధవారం మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో డబుల్ ఇండ్ల నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శంకుస్థాపన చేసిన స్థలాన్ని స్థానికులు సందర్శించి వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు యత్నాన్ని వ్యతిరేకించారు. డబుల్ ఇండ్లకు కేటాయించిన స్థలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ  నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని విన్నవిస్తున్నారు.