నవతెలంగాణ – నెల్లికుదురు
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో, విద్యారంగ అభివృద్ధిలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలిపించుకుందామని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ అన్నారు. గురువారం మండలంలో ఎమ్మెల్సీ ఓటు నమోదు, ప్రచార కార్యక్రమాలలో భాగంగా మునిగలవేడు ఉన్నత పాఠశాలలో కరపత్రం, డోర్ స్టికర్ ఆవిష్కరించే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మునిగలవీడ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చట్ట సభల్లో ఉపాధ్యాయ ప్రతినిధిగా ఉంటూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కావడంలో ముఖ్యపాత్ర వహించారని, అదేవిధంగా కేజిబివి పాఠశాలలు ,ఆదర్శ పాఠశాలలు , గురుకుల పాఠశాలలో నెలకొన్న పలు సమస్యల పట్ల స్పందించి ప్రశ్నించే గొంతుక గా ఉంటూ వాటి పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. ప్రభుత్వాలు ఏవైనా ఉపాధ్యాయులకు నోట్లో నాలుకగా ఉంటూ ఏ సమస్య వచ్చినా వారికి అండగా నర్సిరెడ్డి నిలిచారని, తన నియోజకవర్గ అభివృద్ద నిధులను మొత్తం పాఠశాల అభివృద్ధికే కేటాయించారని, ప్రభుత్వం ఇస్తున్న వేతనాన్ని కూడా సంఘానికి కేటాయించి కేవలం తన ఉపాధ్యాయ పెన్షన్ తో మాత్రమే జీవితాన్ని కొనసాగిస్తు నేటి సమాజానికి. ఆదర్శంగా నిలిచారన్నారు.రానున్న ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్సీ గా అలుగుబెల్లి నర్సిరెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానంకు గాను ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగిందన్నారు నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఉంటుందని అదే నెల 23న తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు ఓటర్ జాబితా పై అభ్యంతరాలను డిసెంబర్ తొమ్మిది వరకు కొనసాగుతుందన్నారు. పూర్తి జాబితా డిసెంబర్ 30న విడుదల చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జనవరి చివర లో గాని ఫిబ్రవరి మొదటి వారంలో గాని జరిగే అవకాశం ఉందని వారన్నారు అందువల్ల యుటిఎఫ్ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఓటు నమోదు చేయించుకోవాలని వారు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో జరగబోయే పోరాటాలకు మన ఎమ్మెల్సీ స్థానం కీలకం కాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు స్వప్న మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.