నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో ఆదివారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పర్యటించారు. గుర్రాల చెరువులోని శ్రీశ్రీ కనక దుర్గ అమ్మవారు ఆలయం, నారాయణపురం లోని కట్ట మైసమ్మ అమ్మ వారి ఆలయం లో జరిగిన ఆషాఢ బోనాల మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఉన్న గ్రామస్థులతో కొద్దిసేపు గడిపారు.నారాయణపురం కాలని వద్ద గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.మంచి నీటి సమస్య ఉందని, ఇల్లు, సీసీ రోడ్లు కావాలని గ్రామస్థులు ఎమ్మెల్యే ని కోరడంతో సానుకూలంగా స్పందించిన ఆయన ఇల్లు ఇస్తానని,మంచి నీటి సమస్యలు వినాయకపురం లో బోర్ వేసి అక్కడ నుంచి పైప్ లైన్ల ద్వారా మంచి నీరు వచ్చేలా చేయాలని అధికారులను ఆదేశించారు.సీసీ రోడ్లు కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని ఇప్పటికీ 2 రోడ్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. (గుర్రాలచెరువు నుంచి కేసప్పగూడెం వెళ్ళే మార్గం మధ్యలో వంతెన చిన్నగా ఉండటం వరద ఎక్కువ వస్తుందని తెలుసుకున్న మెచ్చా నాగేశ్వరరావు వెంటనే స్పందించి అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఫోన్ లో సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామ మూర్తి, జెడ్పీటీసీ వరలక్ష్మీ,బీఆర్ఎస్ మండల కార్యదర్శి జుజ్జూరపు వెంకన్న బాబు,సర్పంచ్ లు కలపాల దుర్గయ్య, కంగాల పరమేష్,ఉప సర్పంచ్ లు,మండల నాయకులు,గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు,యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.