నవతెలంగాణ – శాయంపేట
ఆటో పక్క నుండి వస్తున్న ద్విచక్ర వాహనం ఆటోలో కూర్చున్న బాలిక కుడి చేతికి బలంగా తాకడంతో పాపతో పాటు ద్విచక్ర వాహనం నడిపిస్తున్న వ్యక్తికి గాయాలైన సంఘటన గురువారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన ఆకునూరి రమేష్ పని నిమిత్తం శాయంపేటకు వచ్చి తిరిగి ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి పత్తిపాక కు వెళ్తుండగా శాయంపేట గ్రామ శివారులోని జీవన్ నగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఆటో ప్రక్క నుండి వెళ్తూ ఆటోలో కూర్చున్న ఆకునూరి కళ్యాణి కుడి చేతికి బలంగా తాకడంతో అదుపుతప్పి ద్విచక్ర వాహనం కిందపడిపోయింది. ఈ ఘటనలో కళ్యాణికి కుడి మోచేతికి గాయాలు కాగా, ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రమోద్ కుమార్, ఏఎస్ఐ కుమారస్వామి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని 108 లో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.