
నవతెలంగాణ – కోహెడ
పోలీసు అమరవీరుల ధైర్యం, అంకితభావం, నిబద్ధత వలన సురక్షిత సమాజం నిర్మితమవుతుందని ఎస్సై అభిలాష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శ ఇంగ్లీష్ మీడియం పాఠశాల, సేవ్ ద లైఫ్ పౌండేషన్ సహాకారంతో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తధాన శిభిరానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై, కానిస్టేబుల్‌లు రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదాతలు ఎంతోమంది ప్రాణాలను కాపాడి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని, మైనర్‌లకు వాహనాలను ఇవ్వవద్దని రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తగు జాగ్రత్త వహించాలన్నారు. విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు పోలీస్‌శాఖ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రక్తదానం చేసిన సుమారు 20 మంది యువకులకు సర్టిఫికెట్‌ను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అశోద శైలజ, కరస్పాండెంట్ అశోద అంజయ్య, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, కానిస్టేబుల్‌లు గంగుల రాజు, రాజు, బాబు, తిరుపతి, పిడిశెట్టి రాజు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.