
నాగిరెడ్డిపేట మండలంలో నూతన గ్రంథాలయ భవనాన్ని మంజూరు చేయడం కొరకు నాగిరెడ్డిపేట మండల మాజీ జడ్పిటిసి మనోహర్ రెడ్డి గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, నిరుద్యోగులు, యువతి యువకులు, విశ్రాంత ఉద్యోగులు, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను, గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో తెలియజేసినట్టు తెలిపారు. అనంతరం గ్రంథాలయ చైర్మన్ సానుకూలంగా స్పందించి గ్రంథాలయ భవనం సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.