
ఆర్యవైశ్య సంఘం మహసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా డివిజన్ కేంద్రానికి చెందిన నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎంపీటీసీ గన్ను నర్సింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈపదవి తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. రాబోయే రోజుల్లో ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సిద్ధిపేటకు వెళ్ళే దారిలో ఉషోదయ కన్వెన్షన్ హల్ నందు ఈఆదివారం జిల్లా నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు.