నవతెలంగాణ- బొమ్మలరామారం
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మండలంలో ఉన్న 40,000 వేల ఎకరాల సాగుకు నేటికి రైతు బరోసా (రైతుబంధు ) అందలేదని తక్షణమే రైతు బరోసా ఇవ్వాలని సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ సంబంధించి మండలంలో 40000 వేల ఎకరాలకు రైతు బరోసా ఇవ్వాల్సి ఉందని, వర్ష కాలం లో రైతులు పండించిన పంటను తక్షణమే కొనుగోలు చేయాలని వెంటనే ధాన్యం కొనుగోలు సెంటర్ లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శామీర్పేట రిజర్వాయర్ ద్వారా గ్రామాలను ప్రభుత్వమే సర్వే నిర్వహించి కాలువ పనులు వేగవంతం చేయాలనీ అన్నారు.