నవతెలంగాణ – పెద్దవంగర
నేడు పాలకుర్తి పట్టణ కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నిర్వహించ తలపెట్టిన గిరిజన సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ గిరిజన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిరిజనులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. గిరిజన సదస్సులో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన గిరిజన సదస్సు కు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, శ్రీరామ్ సుధీర్, మాజీ సర్పంచులు, ధరావత్ రాజేందర్ నాయక్, గుగులోత్ పటేల్ నాయక్, చింతల భాస్కర్, పుల్ సింగ్, జ్ఞానేశ్వర చారి, ఎస్టీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.