డిసెంబర్‌లో కన్నప్ప

In December Kannappaమోహన్‌ బాబు, విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్‌ కుమార్‌, నటుడు అర్పిత్‌ రంకాతో కలిసి కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ రిషికేశ్‌లో ఆధ్యాత్మిక తీర్థయాత్రకు బయలుదేరారు. ఈ బృందం దైవిక ఆశీర్వాదం కోసం ఈ పవిత్ర యాత్రను చేపట్టింది. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను ‘కన్నప్ప’ టీం సందర్శించింది. ఆపై బద్రీనాథ్‌లో ప్రార్థనలు కూడా చేశారు. రిషికేశ్‌ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ, ‘కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, రిషికేష్‌కు రావడం ఆనందంగా ఉంది. పరమ శివుడి పరమ భక్తుడి కథగా కన్నప్ప చిత్రం విడుదలకు ముందే మొత్తం 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మా ఎపిక్‌ యాక్షన్‌ చిత్రం విడుదల కోసం మేము ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, అక్షరు కుమార్‌, ప్రభాస్‌, శరత్‌ కుమార్‌తో సహా భారీ తారాగణం ఉంది. ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.