మహానీయులను ఆగౌర పరిస్తే ఉపేక్షించేది లేదు..!

– వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
– అసిపాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
మహనీయులను ఆగౌర పరిచిన,అవమానించిన ఉపేక్షించేది లేదని అసిపాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొయ్యూర్ ప్రధాన కూడలిలో భుపాలపల్లి జిల్లా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో విగ్రహా దాత పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఏర్పాట చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షినిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు అనేక ఏండ్ల క్రితమే మహనీయులు మన కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు. మహనీయుల చరిత్ర తెలుసుకోకపోవడం మూలంగానే మన హక్కులు సాదించుకోలేకపోతున్నామన్నారు. పదేళ్ల క్రితమే మంథని నియోజ కవర్గంలో కొమురంభీం విగ్రహాన్ని అవమానించి పోలీసే స్టేషన్లో పెట్టారని, అదే నియోజకవర్గంలో ఈనాడు ఘనంగా విగ్రహ ఆవిష్కర చేసుకుంటు న్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు ఆంక్షలు పెడుతున్నారని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన మహనీయుల విగ్రహాల ఆవిష్కరణలకు అనేక అడ్డంకులు చెప్పడం విడ్డూ రంగా ఉందన్నారు. ఎంతో మంది అట్టగుడు అణ గారిన వర్గాల కోసం పోరాటాలు చేశారని, నాటి నుంచి నేటి తెలంగాణ సాధించుకునే ఉద్యమం వరకు మహనీయులు స్ఫూర్తి ఉందన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నామని, ఇంకా అణగారిన వర్గాలు మాత్రం అభివృద్ధి చెం దలేదని ఆయన అన్నారు. మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, చరిత్ర తెలుసుకుం టేనే అభివృద్ధి చెందుతామని, ఇందుకోసం తాము పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొలం రాజేందర్, నాయకపోడు సేవ సంఘం జిల్లా కార్యదర్శి గుంటి రమేష్, ఆదివాసీ గిరిజన, నాయకపోడు, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు.