ముధోల్ బంద్ సంపూర్ణం..

Mudhol Bandh is complete..– దోషులను కఠినంగా శిక్షించాలని తహసీల్దార్ కు వినతి
నవతెలంగాణ – ముధోల్
నియోజక వర్గ కేంద్రమైన ముధోల్ ల్లో శనివారం హిందువాహిని, ముధోల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముధోల్ బంద్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా వ్యాపారస్తులు తమ దుకాణలను మూసి బందును పాటించారు. ఈ సందర్భంగా ముధోల్ ఉత్సవ కమిటీ, హిందువాహిని ఆధ్వర్యంలో ముధోల్ లోని ప్రధాన  వీధుల గుండా ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సికింద్రాబాద్ లో ఇటీవల హిందువుల దేవతలను ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. హిందువుల ఆలయ పరిరక్షణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే హిందువుల దేవత విగ్రహాలను ద్వంసం చేసి హిందువుల మనోభావాలను కించపరిచిన దుండగులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరవృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీ సీఐడీకి అప్పజెప్పి ద్రోహులను కఠినంగా శిక్షించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ముధోల్ ఉత్సవ కమిటీ అధ్యక్షు లు రోళ్ల రమేష్, గౌరవ అధ్యక్షులు సుదర్శన్, రాంకి, సాయిలు, సంతోష్,  కోరి పో తన్న, తాటివార్ రమేష్, జీవన్, సంతోష్, తదితరులున్నారు.