పల్లె వెలుగు బస్సులు పునరుద్ధరించాలి

నవతెలంగాణ – మునుగోడు
గతంలో మునుగోడు – నారాయణపురం మండలంలోని ఆయా గ్రామాలలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు నడిచి నిలిచిపోయిన బస్సులను యధావిధిగా తిరిగి పునరుద్ధరించి  గ్రామీణ ప్రాంతాలకు నడిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం కోరారు. శనివారం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ.. గ్రామాలకు నడిచి నిలిచిపోయిన ప్రాంతాలు  1 మునుగోడు నుండి  పలివెల మీదిగా దిల్సుఖ్నగర్  బస్సు గుజ్జ గ్రామపంచాయతీ వరకు పోయే బస్సు రద్దు చేశారు. 2 నల్గొండ దోమలపెళ్లి క్రాస్ రోడ్ నుండి కలవలపల్లి మీదిగా  పులిపలుపుల వయా మునుగోడు ఊకోండి వరకు వెళ్లే బస్సును రద్దు చేశారు.  3 మునుగోడు నుండి చోల్లేడు ,గట్టుపల్ వరకు వెళ్లే బస్సు 4 మునుగోడు మాల్ శివన్న గూడెం మీదుగా వెళ్లే  బస్సు ను రద్దు చేశారు. 5 మునుగోడు నుండి కొంపెల్లి క్రాస్ రోడ్ నుండి కల్వకుంట్ల వరకు మరొక బస్సు ను , నార్కట్పల్లి డిపో బస్సు వయా చౌటుప్పల్ రాత్రి గుజ్జ లో బస చేసే బస్సు సుమారు ఆరు బస్సులను ఈ మధ్యకాలంలో నిలిపివేయడం జరిగిందని తెలిపారు. దీనితో ప్రజలు ,చేనేత చేతివృత్తుల వారు చిరు వ్యాపారులు హైదరాబాదుకు పోయి జీవనోపాధి పొందే నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  విద్యార్థులు ఇంటర్, డిగ్రీ, పిజి చదువుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చేవారికి తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు తక్షణం తర్వాత తీసుకొని ఆగిపోయిన పల్లె వెలుగు బస్సులను పునరుద్ధరించి చిరు వ్యాపారులను విద్యార్థులను చేతివృత్తుల వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, పిఎసిఎస్ చైర్మన్ దోడ యాదవ రెడ్డి, మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, మండల నాయకులు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, కర్నాటి సుధాకర్, పగిళ్ల మధు, కొత్తపల్లి నరసింహ, కర్నాటి వెంకటేశ్వర్లు, చాడ నరసింహ, పెద్దగోని నరసింహ, ఒంటెపాక అయోధ్య తదితరులు పాల్గొన్నారు.