– ఆమనగల్, కడ్తాల్ మండలాల్లో మల్లు రవికి ఘన స్వాగతం
నవతెలంగాణ – ఆమనగల్
తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం తన వంతు కృషి చేస్తానని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యులుగా నియమితులై మొదటి సారి శనివారం ఆమనగల్ కడ్తాల్ మండలాలకు విచ్చేసిన ఎంపీ మల్లు రవితో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు స్థానిక కాంగ్రెస్ నాయకులు పూలమాలలు శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట వేస్తుందని అన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని ఆయన పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా ఎంపీ స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, ఖలీల్, మండల అధ్యక్షులు తెల్గమల్ల జగన్, సబావత్ బిచ్యా నాయక్, పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్య, రాంచందర్ నాయక్, మాజీ అధ్యక్షులు మండ్లి రాములు, సీనియర్ నాయకులు గూడూరు భాస్కర్ రెడ్డి, లక్ష్మయ్య, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాలే మల్లయ్య, రవీందర్ నాయక్, మల్లేష్ గౌడ్, లక్పతి నాయక్, అలీం, ఫరీద్, ప్రసాద్, ఇమ్రాన్ బాబా, మహేష్ తదితరులు పాల్గొన్నారు.