పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తను కాపాడుకుంటాం 

We will protect the worker who worked hard for the party– కార్యకర్తల అభివృద్ధి కోసం కృషి చేద్దాం 
– సమావేశాలు వద్దు సంబరాలు చేసుకుందాం 
– కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 
– మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 
పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను ఎంత కష్టం వచ్చినా కాపాడుకుంటామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చక్ర పంపిణీ కార్యక్రమాన్ని తహసిల్దార్ కోడి చింతల రాజుతో కలిసి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం గ్రామాలలో ఎంతో కష్టపడ్డారని వారికి ఎలాంటి సమస్య వచ్చినా నేను వారిని కాపాడుకుంటానని అన్నారు ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు ప్రతి పేదవాడికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం అందే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు 96 మందికి అందిస్తున్నామని తెలిపారు . ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఒక లక్ష 116 అందిస్తుందని అన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని పట్టించుకున్నారని దాఖలు లేవా అని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రజల బాగోగులు కోసం ఆలోచించాలి తప్ప ఏదో ఎవరో చేస్తున్నారని అంటున్నారని సమావేశాలు పెట్టడం కాదు అని అందరం కలిసి మహబూబాబాద్ అభివృద్ధి కోసం కృషి చేద్దామని అన్నారు. నేను గ్రామాలలో తిరిగానని ప్రతి కార్యకర్త ఎంత కష్టపడ్డారో చూసానని వారిని కచ్చితంగా కాపాడుకుంటామని అన్నారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చే విధంగా కృషి చేద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కోడి చింతల రాజు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.