సరికొత్త కథతో ‘మజాకా’

'Majaka' with a brand new storyఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సందీప్‌ కిషన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. ఇది హీరోగా ఆయనకు 30వ సినిమా. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్‌, జీ స్టూడియోస్‌ బ్యానర్స్‌ పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. 20 రోజుల ఈ భారీ షెడ్యూల్‌లో యాక్షన్‌ బ్లాక్స్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ఓ ఆసక్తికర అప్డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన సందీప్‌ కిషన్‌- రీతూ వర్మల హ్యూమరస్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ జోడి తమ డైనమిక్‌ పెర్ఫార్మెన్స్‌లతో అన్‌ లిమిటెడ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ని అందించబోతున్నారని చిత్ర బృందం తెలిపింది. రావు రమేష్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్‌ బెజవాడ, సహ నిర్మాత: బాలాజీ గుత్తా, లైన్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌ పోపూరి, సంగీతం: లియోన్‌ జేమ్స్‌, డీవోపీ: నిజార్‌ షఫీ, ఆర్ట్‌ డైరెక్టర్‌: బ్రహ్మ కడలి.